News September 3, 2025
KNR: గిరిజన యువతీ యువకులకు శిక్షణా కార్యక్రమం

కరీంనగర్ జిల్లా గిరిజన యువతీ యువకులకు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోని క్యారక్టేరైజేషన్ ప్రాజెక్టులో శిక్షణ కల్పించనున్నారు. నానో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కింద ఈ శిక్షణ జరుగుతుందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తెలిపారు. ఇంజినీరింగ్ లేదా ఎంఎస్సీ చేసిన వారు అర్హులు. దరఖాస్తు కోసం https://www.cense.iisc.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News September 5, 2025
KNR: మహిళా PD పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

మహాత్మా జ్యోతిబా పూలే విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ గురుకుల మహిళా వ్యవసాయ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన మహిళా అభ్యర్థుల నుంచి ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వీ.నర్సింహరెడ్డి తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్ధులు ఈనెల 15లోగా తమ వివరాలను మెయిల్ చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 7680941504 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
News September 5, 2025
KNR: గణేష్ నిమజ్జనం.. KNRలో ట్రాఫిక్ ఆంక్షలు

గణేష్ నిమజ్జనం సందర్భంగా KNRలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు ప్రకటించారు. HZB నుంచి KNRవైపు వచ్చే వాహనాలు మానకొండూరు పల్లె బస్టాండ్ నుంచి ముంజంపల్లి మీదుగా తిమ్మాపూర్ రాజీవ్ రోడ్డుకు చేరుకోవాలి. అక్కడి నుంచి KNR, JGTL నుంచి KNRవైపు వచ్చే వాహనాలను వెలిచాల X రోడ్డు మీదుగా చింతకుంట, పద్మనగర్ X రోడ్డుకు మళ్లిస్తారు. NTR విగ్రహం మీదుగా SRCL బైపాస్ రోడ్డు నుంచి KNR పట్టణానికి డైవర్ట్ చేస్తారు.
News September 4, 2025
నిమజ్జనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి

KNRలో రేపు జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను కేంద్రమంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ఇందులో భాగంగా మానకొండూరు చెరువును, చింతకుంట చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను జిల్లా అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గణేష్ విగ్రహాల తరలింపు సమయంలో కరెంటు తీగలు, చెట్లు అడ్డు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు.