News September 3, 2025
జగన్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ప్లకార్డులు

YSR వర్ధంతి వేడుకలకు, జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం YS జగన్ పర్యటనలో మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు ప్రత్యేకంగా నిలిచింది. మంగళవారం ఉదయం జగన్ పులివెందుల పర్యటనలో ఓటర్ల స్వేచ్ఛను హరించిన చంద్రబాబు అని మహిళలు ప్లకార్డును ప్రదర్శించారు. మహిళలు ప్రదర్శించిన ప్లకార్డు వైపు జగన్ ఆసక్తిగా చూశారు.
Similar News
News September 5, 2025
ఇడుపులపాయ: మినిమం టైమ్ స్కేల్ జీఓపై హర్షం

గత 15 ఏళ్లుగా నిబద్ధతతో ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో నాన్‌టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ జీఓ మంజూరయ్యింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ భద్రతను కాపాడినందుకు సీఎం చంద్రబాబు, డీసిఎం పవన్ కళ్యాణ్, జీఓ అమలులో సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
News September 4, 2025
ప్రొద్దుటూరు: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషులకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు. 100M, 200M, 400M, 1000M పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.