News September 3, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 4, 2025

కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.30కి లింగంపేట(M) మోతె గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. 1:10PMకు కామారెడ్డి టౌన్‌లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. 2:20PMకు కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.

News September 4, 2025

GREAT.. 10th చదివి ఆర్థిక క్రమశిక్షణతో రూ.కోటి పొదుపు!

image

ఆర్థిక క్రమశిక్షణతో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన ఓ వ్యక్తి కథ నెటిజన్లను మెప్పిస్తోంది. తాను పదో తరగతి మాత్రమే చదివి 25 ఏళ్లలో రూ.కోటి పొదుపు చేసినట్లు 53 ఏళ్ల వ్యక్తి రెడిట్‌లో పోస్ట్ చేయగా వైరలవుతోంది. తాను నెలకు రూ.4,200 జీతంతో జీవితాన్ని ప్రారంభించానని, ఎప్పుడూ అప్పు చేయలేదని, క్రెడిట్ కార్డు వాడలేదని తెలిపారు. చాలావరకూ నడుస్తూనే వెళ్తానని, ఈ మధ్యే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నానన్నారు.

News September 4, 2025

సెప్టెంబర్ 4: చరిత్రలో ఈ రోజు

image

1825: జాతీయ నేత దాదాభాయి నౌరోజీ జననం(ఫొటోలో)
1924: కేంద్ర మాజీ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి జననం
1926: శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత బాలు శంకరన్ జననం(ఫొటోలో, కుడివైపు)
1962: భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే జననం
1980: తెలుగు సింగర్, డాన్సర్ స్మిత జననం
1983: పాత తరం తెలుగు సినీ నటి ఛాయాదేవి మరణం
2007: తెలుగు, తమిళ, హిందీ నటి వై.రుక్మిణి మరణం
* జాతీయ వన్యప్రాణుల దినోత్సవం