News September 3, 2025
శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణంపై హరికథ

శ్రీశైలం దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నిత్య కళారాధన, ధర్మపథం కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు చెందిన భాగవతారిణి లక్ష్మీ మహేశ్ బృందం ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం మీద నిర్వహించిన హరికథ గానం భక్తులను అలరించింది. మంగళవారం రాత్రి కళారాధన మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రదర్శన అనంతరం కళాకారులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి అభినందించారు.
Similar News
News September 5, 2025
పర్వతగిరి: గురువుకు 111 సార్లు సన్మానం..!

బోధన తన వృత్తి కాకపోయినా పాఠశాల, కళాశాల విద్యార్థులకు మ్యాథ్స్ బోధిస్తారు. ఆయన విద్యా బోధనలు విన్న పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. గురు దక్షిణగా ఆయనకు సన్మానాలు చేశారు. ఆయన శిష్యులు అందరూ కలిపి 111 సార్లు సన్మానాలు చేసినట్టు పర్వతగిరికి చెందిన మూస మహమ్మద్ తెలిపారు. గురుపూజోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు.
News September 5, 2025
రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,07,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.98,650 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,36,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 5, 2025
మెదక్: ప్రేమ పెళ్లి వద్దన్నందుకు యువతి సూసైడ్ (UPDATE)

ప్రేమ విఫలం కావడంతో <<17611907>>యువతి సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. శివ్వంపేట మం. తాళ్లపల్లి తండాకు చెందిన సక్కుబాయి(21) గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. నారాయణఖేడ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. వరసకు అన్న అవుతాడని పెళ్లి వద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువతి ఈనెల 1న పురుగు మందు తాగింది. ఘటనపై కేసు నమోదైంది.