News September 3, 2025
ఐదు రోజులు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు: కలెక్టర్

వ్యాధుల నిర్మూలన కోసం ఐదు రోజులపాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్‌వాడీ, పంచాయతీ భవన సముదాయాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. విధులు సరిగా నిర్వర్తించని వారిపైచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News September 3, 2025
నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ బందోబస్తు కల్పిస్తున్నట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. నిమజ్జన వేళ ప్రజలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, భద్రతగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి విభాగం అప్రమత్తంగా పని చేయాలని ఆదేశించారు. మెదక్‌లో వినాయక మండపాలను సందర్శించారు.
News September 3, 2025
చేగుంటలో క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు పరీక్షలు

చేగుంట గురుకుల పాఠశాలలో ఈనెల 8, 9న గిరిజన గురుకుల క్రీడా పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు ఎంపిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం తీసుకొని ఉదయం 10:30 గంటల లోగా చేగుంట గురుకుల పాఠశాలలో జరిగే పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
News September 3, 2025
కౌడిపల్లి: తల్లిదండ్రుల గొడవ.. యువతి ఆత్మహత్య

కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్‌కు చెందిన యువతి తల్లిదండ్రుల గొడవతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. బండల మైసయ్య, సమంత దంపతులు తరచూ గొడవ పడుతున్నారు. మంగళవారం సాయంత్రం మళ్లీ గొడవ వద్ద పడుతుండడంతో కూతురు అక్షిత(21) మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.