News September 3, 2025

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాల్లో తనిఖీ

image

ప్రకాశం జిల్లాలో 121 ఎరువుల దుకాణాలను పోలీసులు తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం సాయంత్రం ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా ఎరువుల విక్రయాలను నియంత్రించడమే లక్ష్యంగా బ్లాక్ మార్కెట్‌లో గల ఎరువులను గుర్తించేందుకు సైతం స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించారు.

Similar News

News September 3, 2025

ఒంగోలు: వీడియోలు చూసి మరీ చోరీలు.. చివరికి అరెస్ట్!

image

మహిళల మెడలో చైన్‌లను చోరీ చేస్తున్న చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసినట్లు ఒంగోలు సీసీఎస్ సీఐ జగదీశ్ తెలిపారు. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైన్ స్నాచింగ్‌లకు అలవాటు పడినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి చోరీలకు అలవాటు పడినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అరెస్ట్ చేశామన్నారు.

News September 3, 2025

ప్రకాశం: డబ్బులు చెల్లించండి.. కొత్త రుణాలు ఇస్తాం.!

image

ప్రకాశం జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులు వారి బకాయిలను త్వరితగతిన చెల్లించాలని సంబంధిత శాఖాధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో జిల్లాలో 833 యూనిట్లకు గాను రూ.24.18 కోట్ల బకాయిలు ఉన్నట్లు, పాత బకాయిలను చెల్లించకపోవడంతో కొత్త రుణాలు మంజూరు చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో 364 మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

News September 3, 2025

ప్రకాశం జిల్లా AR SPగా శ్రీనివాసరావు బాధ్యతలు

image

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ దామోదర్‌ను ఏఆర్ విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు మర్యాదపూర్వంగా కలిశారు. ఏఆర్ ఏఎస్పీగా నియమితులైన శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్‌కు మొక్కను అందించగా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.