News September 3, 2025
అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి: డీఎంహెచ్ఓ

బషీరాబాద్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డీఎంహెచ్ఓ లలితాదేవి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు ఆమె సూచించారు.
Similar News
News September 3, 2025
WGL: జిపిఓ అభ్యర్థులకు ఈనెల 5న నియామక పత్రాలు

ఈనెల 5న హైదరాబాద్‌లో జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిపిఓ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద కూడా పాల్గొని, అవసరమైన ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు.
News September 3, 2025
బాలల సంరక్షణ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి: జేసీ

నంద్యాల జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాలలో కనీస సౌకర్యాలు తప్పక కల్పించాలని జేసీ విష్ణు చరణ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్య, వైద్య, కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అని ప్రతి మూడు నెలలు ఒకసారి జిల్లా ఇన్స్పెక్షన్ కమిటీ తనిఖీలు చేసి నివేదికను తమకు సమర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలన్నారు.
News September 3, 2025
చిత్తూరు జిల్లాలో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు

చిత్తూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. నరహరిపేట జడ్పీ టీచర్ ఫిజిక్స్ టీచర్ నౌషద్ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన 30 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందించారు. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సైతం రూపొందించారు. పుంగనూరు మండలం రాంనగర్ స్కూల్ టీచర్ హేమలత, నక్కబండ కేజీబీవీ టీచర్ నౌజియా సైతం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.