News September 3, 2025
నేడు, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశమున్న నేపథ్యంలో ఇవాళ, రేపు APలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అటు TGలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Similar News
News September 5, 2025
బాత్రూమ్‌లో ఫోన్ వాడకం.. పైల్స్‌కు ఆహ్వానం!

మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఫోన్ వాడటం వల్ల హెమోరాయిడ్స్ (పైల్స్) ప్రమాదం పెరగొచ్చని బోస్టన్‌లోని బెత్ ఇస్రాయెల్ డీకొనెస్ మెడికల్ సెంటర్ పరిశోధనలో వెల్లడైంది. బాత్రూమ్‌లో ఫోన్ వాడని వారితో పోల్చితే వాడేవారికి హెమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం 46% ఎక్కువగా ఉంది. వీరు ఒక్కోసారి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు తేలింది. ఇది సమయాన్ని వృథా చేయడంతో పాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది.
News September 5, 2025
ఈ స్కిల్స్ ఉంటేనే కార్పొరేట్ జాబ్స్(1/2)

కార్పొరేట్ రంగంలో పోటీని తట్టుకుని నిలబడాలంటే టెక్నికల్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. నిత్యం అప్‌గ్రేడ్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆఫీస్ వర్క్ కల్చర్‌లో మార్పులను అర్థం చేసుకుని, నేర్చుకుని ముందుకెళ్లాలి. ఈ రంగంలో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, కొలాబరేషన్ లాంటి నాలుగు ‘C’లు అవసరమని నిపుణులు చెబుతున్నారు.
News September 5, 2025
ఈ స్కిల్స్ ఉంటేనే కార్పొరేట్ జాబ్స్(2/2)

Critical Thinking: ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ నిత్యనూతనంగా ఉండాలి. సమస్యలను విశ్లేషించి స్మార్ట్ నిర్ణయాలు తీసుకోవాలి.
Communication Skills: ఉద్యోగ జీవితంలో భావవ్యక్తీకరణ కీలకం. అప్పుడే రాణించగలం.
Creativity: క్రియేటివిటీగా ఆలోచించి, సమస్యలకు పరిష్కారాలు చూపగలగాలి. టెక్నాలజీలపై అప్డేట్‌గా ఉండాలి.
Collaboration: వ్యక్తిగతంగా కంటే టీమ్‌తో కలిసి పనిచేసే స్కిల్ ఉంటేనే గుర్తింపు పొందుతారు.