News September 3, 2025

GWL: ఆగస్టులో షీ టీం పర్ఫామెన్స్ ఇలా!

image

గద్వాల జిల్లా షీ టీమ్ బృందం ఆగస్టులో యువతులకు, విద్యార్థినులకు, పని ప్రదేశాల్లో మహిళలకు ప్రత్యేకంగా 10-అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 73-హాట్ స్పాట్ల తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. 3 పిటిషన్లు స్వీకరించి, 3 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 12 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, 12 ఈ-పెట్టి కేసులు నమోదు చేసి 13 కౌన్సిలింగ్ నిర్వహించిందని తెలిపారు.

Similar News

News September 5, 2025

నరసన్నపేట: మిస్సైన బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం

image

నరసన్నపేటలో గతనెల 26న మిసైన బంగారం వ్యాపారి పి పార్వతీశ్వర గుప్త మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది. శుక్రవారం నరసన్నపేట పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా శ్రీకాకుళం పెద్దపాడు వద్ద రామిరెడ్డి గెడ్డలో మృతదేహం లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

News September 5, 2025

KNR: స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్‌గా సత్యనారాయణ

image

స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకి వీణవంక మండలంలోని ఎలుబాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కే.సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈయన చేసిన విశేష సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించింది. గతంలో చెల్పూరు పాఠశాలలో 36 మంది విద్యార్థులను బాసర ఐఐఐటీకి, 32 మంది నేషనల్ మెయిన్స్ మెరిట్ స్కాలర్షిప్‌కి ఎంపిక అవ్వటంలో ఈయన విశేష కృషి చేశారు.

News September 5, 2025

సంగారెడ్డిలో గురుపూజోత్సవం ప్రారంభం

image

సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం గురుపూజోత్సవం వేడుకలను ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను మార్గదర్శకులుగా తీర్చిదిద్దేది ఉపాద్యాయులు మాత్రమే అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.