News September 3, 2025
మరోసారి మెదక్ జిల్లాకు రానున్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మెదక్ జిల్లాకు రానున్నారు. ఈనెల 4 లేదా 5న భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లా పోచారంలో జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్లో పాల్గొంటారు. పోచారం ప్రాజెక్ట్ పరిశీలించి రోడ్డు మార్గంలో మెదక్ చేరుకుని, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారని తెలిసింది. తెగిపోయిన పోచారం బ్రిడ్జి వద్ద రోడ్డును పునరుద్ధరిస్తున్నారు.
Similar News
News September 5, 2025
నరసన్నపేట: మిస్సైన బంగారం వ్యాపారి మృతదేహం లభ్యం

నరసన్నపేటలో గతనెల 26న మిసైన బంగారం వ్యాపారి పి పార్వతీశ్వర గుప్త మృతదేహం ఎట్టకేలకు లభ్యమయింది. శుక్రవారం నరసన్నపేట పోలీసులు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు చర్యలు చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా శ్రీకాకుళం పెద్దపాడు వద్ద రామిరెడ్డి గెడ్డలో మృతదేహం లభ్యం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. పథకం ప్రకారం హత్య చేసిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
News September 5, 2025
KNR: స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్‌గా సత్యనారాయణ

స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డుకి వీణవంక మండలంలోని ఎలుబాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న కే.సత్యనారాయణ ఎంపికయ్యారు. ఈయన చేసిన విశేష సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించడంతో పాటు స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించింది. గతంలో చెల్పూరు పాఠశాలలో 36 మంది విద్యార్థులను బాసర ఐఐఐటీకి, 32 మంది నేషనల్ మెయిన్స్ మెరిట్ స్కాలర్షిప్‌కి ఎంపిక అవ్వటంలో ఈయన విశేష కృషి చేశారు.
News September 5, 2025
సంగారెడ్డిలో గురుపూజోత్సవం ప్రారంభం

సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం గురుపూజోత్సవం వేడుకలను ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐఐసీ ఛైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను మార్గదర్శకులుగా తీర్చిదిద్దేది ఉపాద్యాయులు మాత్రమే అని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.