News September 3, 2025

NLR: గన్‌తో బెదిరించిందని అరుణపై కేసు

image

ఒంగోలు జిల్లా జైల్లో ఉన్న లేడీ డాన్ అరుణపై మరో కేసు నమోదైంది. ఆస్తి వివాదంలో తలదూర్చి తనను అరుణ గన్‌తో బెదిరించిందని నెల్లూరు నవాబుపేటకు చెందిన శశి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాను ఆసరాగా చేసుకుని అరుణ సెటిల్మెంట్‌కి ప్రయత్నం చేసింది. ఈక్రమంలో శశికుమార్ వినకపోవడంతో అతన్ని గన్‌తో బెదిరించింది. నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 7, 2025

CMచేతుల మీదుగా అవార్డు అందుకున్న టీచర్ ఈశ్వరమ్మ

image

కందుకూరుకు చెందిన టీచర్ ఈశ్వరమ్మ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డును CMచంద్రబాబు, మంత్రి లోకేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ప్రకాశం జిల్లా PCపల్లిలో టీచర్‌గా పనిచేస్తున్నారు. సాహిత్యాభిలాషి అయిన ఆమె ‘ఈశ్వరీభూషణం’ అనే కలం పేరుతో దాదాపు 2 వేల కవితలు రాసి ప్రశంసలు పొందారు. అవార్డు అందుకున్న ఆమెను పలువురు అభినందిస్తున్నారు.

News September 7, 2025

ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌–2025 పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ ఇండియా

image

ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌–2025 పోస్టర్లను కలెక్టర్ ఆనంద్ కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. పోటీల్లో పాల్గొనడానికి 16-25 ఏళ్ల యువత అర్హులన్నారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్లో ఎస్ఐడీహెచ్ పోర్టల్ లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటుచేసుకుని ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 6, 2025

రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో యూరియా: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 2471 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. రాబోయే పది రోజులలో 500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు చేరుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆధార్ అధికృత విధానం ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. యూరియా సరఫరాలో లేదా ధరలలో ఫిర్యాదులు ఉంటే 8331057285 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.