News September 3, 2025
ఆ 3 బ్యారేజీల కథ ముగిసినట్లేనా?

TG: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని సీఎం <<17595200>>రేవంత్<<>> ప్రకటించడంతో కాళేశ్వరంలోని 3 బ్యారేజీల కథ ముగిసినట్లేననే తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే కుంగిపోగా, అన్నారం, సుందిళ్లకు సైతం ముప్పు ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆ 3 బ్యారేజీలతో పని లేకుండా ప్రాణహితపై తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టి ఎల్లంపల్లికి నీటిని తరలించనుంది. మధ్యలో ఒక లిఫ్ట్ చాలని, గ్రావిటీతో నీళ్లు వస్తాయని సర్కార్ తెలిపింది.
Similar News
News September 6, 2025
GREAT: 20లక్షల పుస్తకాలతో లైబ్రరీ

పుస్తకాలు సేకరించే అభిరుచిని ప్రజా ప్రయోజనంగా మార్చారు కర్ణాటకలోని హరలహల్లికి చెందిన అంకే గౌడ. బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సాహిత్యంలో మాస్టర్స్ పూర్తి చేశారు. పుస్తకాల సేకరణకు తన ఆస్తిని కూడా అమ్మేశారు. ప్రస్తుతం ఆయన 20లక్షల పుస్తకాలతో వ్యక్తిగత లైబ్రరీని ఏర్పాటు చేయగా అందులో 5లక్షల విదేశీ పుస్తకాలు, వివిధ భాషలకు చెందిన 5K నిఘంటువులు ఉన్నాయి. ఈ లైబ్రరీకి న్యాయమూర్తులు సైతం వెళ్తుంటారు.
News September 6, 2025
రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు TTD అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ‘మ.3.30గంటలకు ఆలయం మూసివేస్తాం. ఎల్లుండి సుప్రభాత సేవతో ఆలయ తలుపులు తెరుస్తాం. మధ్యాహ్నంలోపు 30వేల మందికి దర్శనం కల్పిస్తాం. రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు’ అని చెప్పారు. అలాగే శ్రీశైలం ఆలయం కూడా రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేయనున్నారు.
News September 6, 2025
ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత ఆర్చర్లు

సౌత్ కొరియాలో జరుగుతున్న ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో భారత ఆర్చర్లు వెన్నం సురేఖ, రిషభ్ యాదవ్ సత్తా చాటారు. సెమీ ఫైనల్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో చైనీస్ తైపీ జట్టుపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లారు. చైనీస్ తైపీపై 157-155 పాయింట్ల తేడాతో నెగ్గారు. ఫైనల్లో నెదర్లాండ్స్‌ను వీరు ఎదుర్కొంటారు.