News September 3, 2025
VZM: మహిళలకు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ పాఠశాలలో డ్రైవింగ్ శిక్షణకు నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా SC కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. కనీసం ఏడాది కాలపరిమితి గల లైట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్‌తో ఈనెల 5వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News September 5, 2025
VZM: ‘13న కేసులు రాజీ చేసుకోండి’

విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. నూతన కోర్డు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
News September 5, 2025
9న విజయనగరంలో జాబ్ మేళా

విజయనగరం మహిళ ప్రాంగణంలోని SEEDAP ఆధ్వర్యంలో ఈనెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా పథక సంచాలకుడు శ్రీనివాస్ పాణి గురువారం తెలిపారు. వివిధ కంపెనీల్లో 240 ఉద్యోగాలకు మేళా జరుగుతుందన్నారు. టెన్త్ నుంచి డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులని, 18 నుంచి 28 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. యువతీ, యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News September 5, 2025
VZM: ‘215 గ్రామాల్లో చెరువులు, కల్వర్టుల మరమ్మతులు’

విజయనగరం జిల్లాలో 215 గ్రామాల్లో చెరువులు, కల్వర్టుల మరమ్మతులకు త్వరితగతిన ప్రణాళిక తయారుచేసి వారంలోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. సీఎస్‌తో గురువారం జరిగిన వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రోజుకు 100 చెరువులు నిర్దేశించుకొని పనులు పూర్తిచేయాలని అన్నారు. పనుల పురోగతిపై ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని సంయుక్త కలెక్టర్‌ను ఆదేశించారు.