News September 3, 2025
KU: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ దాడి

వ్యభిచార గృహంపై మంగళవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. KUC పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయగణపతి రోడ్ నం.15లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ విటుడు, నిర్వాహకుడితో పాటు ఇద్దరు బాధితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Similar News
News September 7, 2025
HEADLINES

* ప్రపంచ శాంతి కోసం భారత్-ఫ్రాన్స్ కలిసి పనిచేస్తాయి: PM మోదీ
* హైదరాబాద్‌లో అట్టహాసంగా నిమజ్జనం.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
* చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
* GST ఎఫెక్ట్స్‌తో కార్ల ధరలు తగ్గించిన మారుతీ, మహీంద్రా, టొయోటా
* ఈ నెల 9న ‘అన్నదాత పోరు’: YCP
* లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్
News September 7, 2025
జస్టిస్ సుదర్శన్ రెడ్డికి MIM మద్దతు

వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వనున్నట్లు ఎంఐఎం ప్రెసిడెంట్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ తనను కోరినట్లు అసద్ Xలో పోస్ట్ చేశారు. ‘హైదరాబాదీ, న్యాయనిపుణుడైన సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. ఆయనతో మాట్లాడి బెస్ట్ విషెస్ చెప్పాను’ అని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈనెల 9న జరగనుంది.
News September 7, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> రేపు పాలకుర్తి సోమేశ్వర ఆలయం మూసివేత
> జనగామ: యూరియా కోసం రైతుల ఇక్కట్లు
> జనగామలో బంజారాల రౌండ్ టేబుల్ సమావేశం
> జనగామ: మా సార్‌ను పంపించకుంటే ఆత్మహత్య చేసుకుంటాం: విద్యార్థులు
> జవహర్ నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం
> పాలకుర్తి: రాష్ట్ర స్థాయి పోటీలకు ఉపాధ్యాయుడు ఎంపిక
> జనగామ నుంచి లండన్‌కు గణపతి లడ్డూ
> కోర్టుకు హాజరైన జనగామ ఉద్యమకారులు