News April 3, 2024
అరసవల్లి: కిడ్నీ నుంచి 6సె.మీ రాయి తొలగింపు

రోగి కిడ్నీ నుంచి తొలగించిన 6 సెంటీమీటర్ల రాయి నగరంలోని గ్లోబల్ న్యూరోకేర్ ఆస్పత్రి వైద్యులు బొడ్డేపల్లి యోగేష్ (యూరాలజిస్ట్), డా.గొనప భవానిల ఆధ్వర్యంలో ఓ రోగి కిడ్నీ నుంచి ఏకంగా 6 సెంటీమీటర్ల రాయిని తొలగించారు. ఈ విషయాన్ని ఎండీ దేవిరెడ్డి గౌతమ్ మంగళవారం తెలిపారు. సాధారణంగా కిడ్నీలో 0.5 సె.మీ రాయి ఉంటేనే శస్త్రచికిత్సలు చేస్తామని, అలాంటిది అరుదుగా 6 సె.మీ ఉండడం గుర్తించి తొలగించామన్నారు.
Similar News
News January 8, 2026
ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.
News January 8, 2026
SKLM: నలుగురు ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేసిన చైర్‌పర్సన్

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.
News January 8, 2026
SKLM: అంగన్వాడీలో చిన్నారులకు కొత్త మెనూ

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న మెనూలో స్వల్పమార్పులు జరిగాయి. కేంద్రాల్లో చిన్నారులకు మంగళ, శనివారాలు ఉదయం ఉడకబెట్టిన శనగలు, మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్‌రైస్ పెట్టాలని ఐసీడీఎస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా అన్నం, ఆకుకూరలు, పప్పు, కూరగాయలు, పాలును అమలు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,562 కేంద్రాల్లో కొత్త మెనూ అమలులోకి వచ్చింది.


