News September 3, 2025

అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

image

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.

Similar News

News September 5, 2025

చెవిరెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు

image

AP: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. ‘సిట్ అధికారుల ఆదేశాలతో చెవిరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశాం. కంపెనీల వివరాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నాం. వాటిని విచారణ కోసం సిట్‌కు పంపుతాం. 6 కంపెనీలకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంపెనీల వివరాలు పరిశీలించాం’ అని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు.

News September 5, 2025

PKL: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్

image

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచులో 37-32 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ప్లేయర్లు విజయ్ మాలిక్, భరత్ చెరో 8 పాయింట్లతో అదరగొట్టారు. డిఫెన్స్‌లో ఏకంగా 14 పాయింట్లు రాబట్టారు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ తెలుగు టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

News September 5, 2025

ఏయూకు స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో 4వ స్థానం

image

AP: స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీ విభాగంలో ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది. యూనివర్సిటీ విభాగంలో 23వ స్థానానికి చేరుకుంది. ఏయూ ఫార్మసీ కాలేజీ 31, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ 88వ స్థానంలో, డాక్టర్ BR అంబేడ్కర్ న్యాయ కళాశాల 16వ స్థానంలో నిలిచాయి. AU నాలుగో స్థానంలో నిలవడం పట్ల మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు.