News September 3, 2025
కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తి!

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్‌లో ఫిట్‌నెస్ టెస్ట్ పూర్తయినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. మిగతా ప్లేయర్లందరికీ ఇండియాలోనే టెస్టులు జరగగా, ఆయనకు మాత్రమే విదేశాల్లో నిర్వహించారని పేర్కొన్నాయి. ఇటీవల రోహిత్ శర్మ, గిల్, సిరాజ్, బుమ్రా తదితర ఆటగాళ్లకు బెంగళూరులో ఫిట్‌నెస్ టెస్టులు <<17575424>>జరిగిన<<>> సంగతి తెలిసిందే. ఈ నెలలో నిర్వహించే సెకండ్ ఫేజ్‌లో మిగతా ప్లేయర్లనూ పరీక్షించనున్నారు.
Similar News
News September 5, 2025
నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్‌పై బ్యాన్

నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, X, రెడిట్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియా యాప్స్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఇవాళ రాత్రి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఐటీ చట్టాల నిబంధనలను పాటించడంతో విఫలం కావడమే నిషేధానికి కారణమని వెల్లడించింది. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News September 5, 2025
చెవిరెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు

AP: లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు ముగిశాయి. ‘సిట్ అధికారుల ఆదేశాలతో చెవిరెడ్డి ఇంట్లో తనిఖీలు చేశాం. కంపెనీల వివరాలు, పలు రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నాం. వాటిని విచారణ కోసం సిట్‌కు పంపుతాం. 6 కంపెనీలకు సంబంధించిన వివరాలు ఇచ్చారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంపెనీల వివరాలు పరిశీలించాం’ అని విజిలెన్స్ ఎస్పీ తెలిపారు.
News September 5, 2025
PKL: బోణీ కొట్టిన తెలుగు టైటాన్స్

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచులో 37-32 పాయింట్ల తేడాతో గెలిచింది. టైటాన్స్ ప్లేయర్లు విజయ్ మాలిక్, భరత్ చెరో 8 పాయింట్లతో అదరగొట్టారు. డిఫెన్స్‌లో ఏకంగా 14 పాయింట్లు రాబట్టారు. అంతకుముందు రెండు మ్యాచుల్లోనూ తెలుగు టైటాన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.