News September 3, 2025
పలాసలో దారుణ హత్య ..!

పలాస(M) కేసుపురంలో మంగళవారం అర్ధరాత్రి చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలువురు దాసుల వద్దకు వెళ్లగా గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 5, 2025
శ్రీకాకుళం జిల్లా టుడే టాప్ న్యూస్ ఇవే

✮ కోటబొమ్మాళి, ఎచ్చెర్ల ఏఎంసీ ఛైర్మన్లుగా శేషగిరిరావు, పద్మ
✮ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పలువురు ఎంపిక
✮ పలాస: 16 కేజీల గంజాయితో ముగ్గురు అరెస్ట్
✮ 9న యూరియా కొరతపై వైసీపీ నిరసన: కృష్ణదాస్
✮ రావివలసలో రూ. 1 లక్ష పలికిన గణేశ్ లడ్డు.
✮ సంతబొమ్మాలి: వరద నీటిలో పంట పొలాలు
✮ అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారు: తిలక్
News September 4, 2025
రణస్థలంలో 500 ఉద్యోగాలకు జాబ్ మేళా

శ్రీకాకుళం(D) రణస్థలంలో ఈ నెల 6న 500 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ఈ మేళా జరగనుందన్నారు. టెన్త్‌తో పాటు ఉన్నత విద్య అభ్యసించిన వారు అర్హులన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.
News September 4, 2025
శ్రీకాకుళం: ‘బాల్యవివాహాల నివారణకు కృషి చేయాలి’

బాల్యవివాహాలు నివారణకు కృషి చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ విమల అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని తన కార్యాలయంలోని జిల్లా సీడీపీఓ, సూపర్‌వైజర్లతో బాల్యవివాహాలు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలు గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు.