News September 3, 2025

NGKL: కబడ్డీ.. పాలమూరు బిడ్డ ఆల్ టైం రికార్డు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా పదర మండలనికి చెందిన బండి రమేశ్-రమాదేవిల కుమార్తె నందిని U-18 విభాగంలో ఇండియా కబడ్డీ క్యాంపుకు ఎంపికయింది. గత నెల 28 నుంచి శిక్షణ ప్రారంభమైంది. 2 సార్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మున్ననూర్ గురుకుల విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న ఈమె రాష్ట్ర స్థాయి అండర్-17 విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. జాతీయ స్థాయి సబ్ జూనియర్ టోర్నీలో 2 సార్లు ఎంపికయింది.

Similar News

News September 7, 2025

వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా శ్రీదేవి

image

రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్‌గా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలానికి చెందిన శ్రీదేవిని కూటమి ప్రభుత్వం నియమించింది. మండల పరిధిలోని కొడికొండ చెక్ పోస్టుకు చెందిన శ్రీదేవి టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News September 7, 2025

నేడే చంద్ర గ్రహణం.. ఈ పనులు మానుకోండి

image

నేడు రాత్రి 9.58కి చంద్ర గ్రహణం మొదలుకానుంది. కానీ <<17628465>>సూతక కాల<<>> ప్రభావం మధ్యాహ్నం 12.57 నుంచే ఉంటుందని పండితులు చెబుతున్నారు. ‘ఈ సమయంలో ఆహారం తీసుకోవద్దు. వండుకోవద్దు. ముందే వండిపెట్టిన ఆహారంపై దర్భ గడ్డి/తులసి ఆకులు వేసి ఉంచాలి. లేదంటే కలుషితం అవుతుంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు వద్దు. SEP 8, 1.26AMకి గ్రహణం ముగుస్తుంది. ఆ తర్వాత దానాలు చేస్తే విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి’ అని సూచిస్తున్నారు.

News September 7, 2025

US, చైనాలో ఇండియా దేనికి క్లోజ్? నిర్మల ఏమన్నారంటే?

image

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల భద్రత, శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రపంచ దేశాలతో భారత సంబంధాలపై ఆమె మాట్లాడారు. US, చైనాలో IND దేనికి క్లోజ్ అని ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ ‘IND అంతటా స్నేహితుల్ని కోరుకుంటుంది. Quad, BRICS, RIC మూడింట్లో ఉంటుంది. కానీ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. GST స్లాబ్స్ మార్పునకు US టారిఫ్స్ కారణం కాదన్నారు.