News September 3, 2025

భిన్నత్వంలో ఏకత్వానికి హైదరాబాద్ నిదర్శనం

image

భిన్నత్వంలో ఏకత్వానికి HYD నిదర్శనం అనడానికి ఈ ఫొటోనే గొప్ప ఉదాహరణ. యాకుత్‌పురలో సుమారు 30 ఏళ్లుగా కటింగ్ షాప్ నడుపుతున్నట్లు ప్రదీప్ తెలిపారు. షాప్‌లో వెంకటేశ్వర స్వామి, ముస్లిం సమాజానికి ప్రత్యేకమైన కాబా ఒకే దగ్గర ఏంటని అడగగా.. ఆయన తండ్రి ఇష్టంగా పూజించేవారని, ఆయన మరణం తర్వాత షాప్, ప్రార్థన బాధ్యతలు ప్రదీప్ తీసుకున్నట్లు వివరించారు.

Similar News

News September 4, 2025

HYD: ఏపీపీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. దాదాపు 118 పోస్టులకు దరఖాస్తులను ఆన్లైన్‌లోనే అప్లై చేయాలి. ఫీజు రూ.2000, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. ఆసక్తిగల వారు ఈనెల 12 నుంచి అక్టోబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు www.tgprg.in వెబ్ సైట్ చూడవచ్చు.

News September 4, 2025

నాంపల్లి: డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులకు 15 వరకు ఛాన్స్

image

డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్ కోర్సులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈనెల 15 వరకు ఉందని ఇగ్నో సీనియర్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. నాంపల్లిలో ఇగ్నో స్టడీ సెంటర్ ఉందని, చదువుకోవాలని ఆసక్తి ఉన్న వారు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలను 040-23117550, 9492451812 నంబర్లకు ఫోన్ చేసి తెలసుకోవచ్చన్నారు.

News September 4, 2025

HYD: ఐకమత్యం.. ఫ్రెండ్స్‌కు లడ్డూ సొంతం

image

వినాయక నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డూ రూ.కోటి పలికింది అని వినగానే ఆశ్చర్యపోతాం. గొప్పింటి వారికి వేలంలో నెగ్గడం ఈజీ. కానీ మిడిల్ క్లాస్లో ఐకమత్యం ఉంటే చాలని ఈ మిత్రులు నిరూపించారు. రాంనగర్ EFYA ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలంలో ఫ్రెండ్స్ లోకేష్, యోగేశ్వర్, కార్తీక్, డికాప్రియో కలిసి రూ.55 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. ఒక్కరితో కాదు.. నలుగురం కలిస్తే లడ్డూ దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.