News September 3, 2025
ఖమ్మం: చేపపిల్లల టెండర్ల దాఖలు గడువు పొడిగింపు

ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 882 జలాశయాల్లో 3.49కోట్ల చేపపిల్లలు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దరఖాస్తు కోసం ఆహ్వానించిన విషయం తెలిసింది. అయితే జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నాటికి మూడు టెండర్లు నమోదైనట్లు సమాచారం. దీంతో గడువును ఈనెల 8వ తేదీ వరకు పెంచారు. ఆపై టెండర్లను ఖరారు చేశాక చేప పిల్లల పంపిణీ చేయనున్నారు.
Similar News
News September 7, 2025
ఖమ్మం: నవంబరు 23న ఉపకార వేతన పరీక్ష

2025-26 విద్యాసంవత్సరంలో నవంబరు 23న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జి డీఈవో, అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.50 ఆన్ లైన్‌లో చెల్లించాలని సూచించారు.
News September 6, 2025
ఖమ్మం: తరగతి గదిలో టీచర్ల పాత్ర కీలకం

సాంకేతికత ఎంత అందుబాటులో ఉన్నా, తరగతి గదుల్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థి జీవితాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. టీచర్స్ డే సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
News September 6, 2025
ఖమ్మంను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాను పర్యాటక రంగంలో ఉన్నతంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
శనివారం ఖమ్మం ఖిల్లా రోప్ వే నిర్మాణ ప్రాంతం, జాఫర్ బావి మరింత సుందరీకరణ కోసం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి క్షేత్ర స్థాయిలో సందర్శించి, చేపట్టాల్సిన పనుల గురించి పరిశీలించారు. అనంతరం రోప్ వే నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు.