News September 3, 2025

అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్: రింకూ సింగ్

image

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Similar News

News September 7, 2025

త్వరలో భారత్‌కు మాల్యా, నీరవ్?

image

ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను త్వరలోనే భారత్ తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే UKకు చెందిన ఓ బృందం ఢిల్లీలోని తీహార్ జైలులో వసతులను పర్యవేక్షించింది. జైలులోని సదుపాయాలతో వాళ్లు సంతృప్తి చెందినట్లు, UK అథారిటీలకు ఫేవరబుల్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జైలు వసతుల విషయంలో యూకే కోర్టులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సంతృప్తి చెందకపోతే ఖైదీల అప్పగింతకు నిరాకరిస్తాయి.

News September 7, 2025

పాలలో వెన్నశాతం పెరగాలంటే?

image

* కొత్త మేతను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ వెళ్లాలి.
* దాణా మేపడానికి 2-3గంటల ముందుగా పచ్చి, ఎండు గడ్డిని ఇవ్వడం ఉత్తమం.
* పశువుల నుంచి 6-7 నిమిషాల్లో పాలను పిండుకోవాలి. నెమ్మదిగా పిండితే కొవ్వు శాతం తగ్గుతుంది.
* పాలు పితికేటప్పుడు వాటిని కొట్టడం, అరవడం లాంటివి చేయకూడదు.
* పశువులను మేత కోసం ఎక్కువ దూరం నడిపించకూడదు.
* వ్యాధులకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి.

News September 7, 2025

IOCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఇంజినీర్స్/ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో B.Tech./ BE 65% మార్కులతో(SC/ ST/ PwBDలకు 55%) పాసైన వారు అర్హులు. ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 26ఏళ్లలోపు ఉండాలి. పోస్టుల సంఖ్యపై త్వరలో ప్రకటన రానుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం ₹50,000 – ₹1,60,000 వరకు ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://iocl.com<<>>