News September 3, 2025
అనకాపల్లి జిల్లాలో 28 పంచాయతీలకు కొత్త భవనాలు: ఈఈ

అనకాపల్లి జిల్లాలో 28 పంచాయతీలకు కొత్తగా భవనాలు నిర్మించనున్నట్లు పీఆర్ ఈఈ ఎన్.శివ ప్రసాద్ తెలిపారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.8.96 కోట్లు మంజు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో పలువురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించగా వాటికి పరిపాలన పరమైన ఆమోదం లభించిందని అన్నారు. ఒక్కొక్క భవనానికి రూ.32 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభించినట్లు చెప్పారు.
Similar News
News September 7, 2025
మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్‌తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News September 7, 2025
ఖమ్మం: ప్రేమ నిరాకరించిందని.. యువకుడి SUICIDE

ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగరాజు వివరాలిలా.. మునిగేపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సిద్ధు(25) ఓ యువతిని ప్రేమించాడు. ప్రేమించిన యువతి తన ప్రేమను కాదనడంతో మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధు తండి హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News September 7, 2025
త్వరలో భారత్‌కు మాల్యా, నీరవ్?

ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను త్వరలోనే భారత్ తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే UKకు చెందిన ఓ బృందం ఢిల్లీలోని తీహార్ జైలులో వసతులను పర్యవేక్షించింది. జైలులోని సదుపాయాలతో వాళ్లు సంతృప్తి చెందినట్లు, UK అథారిటీలకు ఫేవరబుల్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జైలు వసతుల విషయంలో యూకే కోర్టులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సంతృప్తి చెందకపోతే ఖైదీల అప్పగింతకు నిరాకరిస్తాయి.