News September 3, 2025
బంగారం ధరలు ALL TIME RECORD

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరింది. కాగా 9 రోజుల్లో రూ.5,460 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.98,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News September 7, 2025
త్వరలో భారత్‌కు మాల్యా, నీరవ్?

ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను త్వరలోనే భారత్ తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే UKకు చెందిన ఓ బృందం ఢిల్లీలోని తీహార్ జైలులో వసతులను పర్యవేక్షించింది. జైలులోని సదుపాయాలతో వాళ్లు సంతృప్తి చెందినట్లు, UK అథారిటీలకు ఫేవరబుల్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జైలు వసతుల విషయంలో యూకే కోర్టులు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సంతృప్తి చెందకపోతే ఖైదీల అప్పగింతకు నిరాకరిస్తాయి.
News September 7, 2025
పాలలో వెన్నశాతం పెరగాలంటే?

* కొత్త మేతను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పెంచుతూ వెళ్లాలి.
* దాణా మేపడానికి 2-3గంటల ముందుగా పచ్చి, ఎండు గడ్డిని ఇవ్వడం ఉత్తమం.
* పశువుల నుంచి 6-7 నిమిషాల్లో పాలను పిండుకోవాలి. నెమ్మదిగా పిండితే కొవ్వు శాతం తగ్గుతుంది.
* పాలు పితికేటప్పుడు వాటిని కొట్టడం, అరవడం లాంటివి చేయకూడదు.
* పశువులను మేత కోసం ఎక్కువ దూరం నడిపించకూడదు.
* వ్యాధులకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్స అందించాలి.
News September 7, 2025
IOCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో ఇంజినీర్స్/ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో B.Tech./ BE 65% మార్కులతో(SC/ ST/ PwBDలకు 55%) పాసైన వారు అర్హులు. ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 26ఏళ్లలోపు ఉండాలి. పోస్టుల సంఖ్యపై త్వరలో ప్రకటన రానుంది. ఆన్‌లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం ₹50,000 – ₹1,60,000 వరకు ఉంటుంది.
వెబ్‌సైట్: <