News September 3, 2025

గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీపై HYD సీపీ సమీక్ష

image

సీపీ సీవీ ఆనంద్ గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగల భద్రతా ఏర్పాట్లపై HYD పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని జోనల్ ఆఫీసర్లు, లా & ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజల సహకారంతో భద్రత ఏర్పాట్లను పటిష్ఠంగా నిర్వహిస్తామని తెలిపారు.

Similar News

News September 5, 2025

HYD పరువు తీస్తున్నారు.. మీరు మారరా?

image

వినాయకచవితి పండుగ నగర యువతకు ఒక ఎమోషన్. ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొనే వేడుక ఇది. కానీ, కొందరు పరువు తీస్తున్నారు. ఖైరతాబాద్‌‌కు దర్శనానికి వచ్చిన అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి 930 మంది పట్టుబడ్డారు. మరికొందరు మద్యం తాగి జులూస్‌లకు వస్తున్నారు. భక్తిపాటలకు బదులు తమకు నచ్చిన పాటలతో చిందులేసిన వీడియోలు SMలో వైరల్ అయ్యాయి. ఇకనైనా వీటికి స్వస్థి పలికి భక్తితో నిమజ్జనం చేద్దాం. దీనిపై మీ కామెంట్?

News September 5, 2025

HYD: SBI రివార్డ్ పాయింట్ల పేరిట మోసం..జాగ్రత్త!

image

SBI రివార్డు పాయింట్ల తేదీ గడిచిపోతుందని, వాటిని నగదుగా మార్చుకోవాలంటే వెంటనే APK ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవాలని వాట్సప్, ఫేస్‌బుక్, మెసేజెస్ ద్వారా వచ్చే సమాచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచించారు. APK డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం వ్యక్తిగత వివరాలు తీసుకునే ప్రమాదం ఉందన్నారు. SBI బ్యాంకు అలాంటిది ఏది వాట్సాప్ ద్వారా పంపదని ఉప్పల్ SBI ప్రశాంత్ నగర్ అధికారులు తెలిపారు.

News September 5, 2025

HYD: గణేశ్ నిమజ్జనం కోసం.. ఆన్ డ్యూటీలో అన్ని శాఖలు!

image

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి ప్రభాకర్ తెలిపారు. పోలీస్, రెవెన్యూ, విద్యుత్, HMDA, వాటర్ బోర్డు, ట్రాఫిక్ పోలీస్, R&B, హైడ్రా, మెడికల్ & హెల్త్, టూరిజం & ఇన్ఫర్మేషన్ విభాగాలు ఆన్ డ్యూటీలో ఉన్నట్లు చెప్పారు. GHMC సెప్టెంబర్ 6న విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.