News September 3, 2025
టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా?

స్కోర్ లైన్ లేని టాబ్లెట్‌లను విరిచి వేసుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘వైద్యుల సూచన లేకుండా ఏ టాబ్లెట్‌ను విరిచి వేసుకోవద్దు. టాబ్లెట్‌ను విరిస్తే దాని పనితీరు దెబ్బతినడంతో పాటు హానికరంగా మారే అవకాశముంది. డ్రగ్ రక్తంలో ఒకేసారి రిలీజై డోస్ ఎక్కువ అవ్వొచ్చు లేదా ఇన్ఎఫెక్టీవ్‌గా మారొచ్చు. కడుపులో ఇరిటేషన్ వచ్చే ఛాన్సుంటుంది. ఒకవేళ వైద్యులు సూచిస్తే పిల్ కట్టర్ వాడాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News September 7, 2025
‘ఫర్నిచర్ డిజైన్’తో కెరియర్ డిజైన్(1/2)

ప్రస్తుత ఆధునిక కాలానికి తగ్గట్లుగా ఇంట్లో ఫర్నిచర్‌ను డిజైన్ చేయించుకోవడం పెరిగింది. ఈ రంగంలో అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో సోఫాలు, కుర్చీలు, బల్లలు, బెడ్స్ తదితర వస్తువులను వినూత్నంగా తీర్చిదిద్దే సృజనాత్మక ఉన్నవారికి మంచి డిమాండ్ ఉంది. NIFT, NID, UCEED, NEED వంటి ప్రవేశపరీక్షలు రాసి యూజీ స్థాయిలో ఫర్నిచర్ డిజైన్ కోర్సుల్లో చేరవచ్చు. తర్వాత పీజీ కూడా చేయొచ్చు.
News September 7, 2025
‘ఫర్నిచర్ డిజైన్’తో కెరియర్ డిజైన్(2/2)

ఫర్నిచర్ డిజైన్ కోర్సులు చేసినవారు ఇంటీరియర్ డిజైనర్, ఫర్నిచర్ కన్జర్వేటర్, ప్రొడక్ట్ రీసెర్చర్, ఇన్నోవేటర్ వంటి ఉద్యోగాల్లో చేరవచ్చు. గోద్రేజ్, ఐకియా, నీల్‌కమల్, స్టైల్ స్పా, ఫ్లోరెన్స్ వంటి అనేక పెద్ద కంపెనీలు ఏటా పెద్దఎత్తున ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. వర్క్‌షాప్స్, వెబినార్స్, కన్వెన్షన్స్, ఈవెంట్లకు హాజరవుతూ ఈ రంగంపై నిత్యం అప్డేట్‌గా ఉంటే మంచి జీతంతో దూసుకుపోవచ్చు.
News September 7, 2025
సముద్రం లోపల ఫైబర్ కేబుల్స్ కట్

ఎర్ర సముద్రం లోపల ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కట్ అయ్యాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. దీనివల్ల ఆసియా, యూరప్ ప్రాంతాల్లో తమ Azure సర్వీసులకు అంతరాయం కల్గుతుందని పేర్కొంది. రిపేర్ చేసేందుకు సమయం పడుతుందని, రోజువారీ అప్‌డేట్స్ ఇస్తామని తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద క్లౌడ్ సేవలందించే సంస్థ Azure. ఆ కేబుళ్లను హౌతీలు కట్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.