News September 3, 2025

ఉద్యోగం కోసమే తండ్రిని చంపాడా?

image

కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో తండ్రి రామాచారిని కుమారుడు వీరస్వామి చారి <<17598178>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. రామాచారి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం కోసం తండ్రిని కుమారుడు హతమార్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 7, 2025

కర్నూలులో ఏఐ టెక్నాలజీతో 100 సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు: మంత్రి

image

కర్నూలులో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఏఐ టెక్నాలజీతో కూడిన 100 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. శనివారం ప్రభుత్వ అతిథి గృహంలో కెమెరాల ఏర్పాటుకు కుడా నిధులు రూ.29.84 లక్షల చెక్కును ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు మంత్రి అందజేశారు. కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ నవ్య, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

News September 6, 2025

పేలుడు పదార్థాలు గుర్తించడంలో ‘హంటర్’ కీలకం: ఎస్పీ

image

పేలుడు పదార్థాలు గుర్తించడంలో బెల్జియం దేశ మలునాయిస్ జాతికి చెందిన హంటర్ డాగ్ కీలకమైన సేవలు అందిస్తుందని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన హంటర్ డాగ్‌ను ఎస్పీ తన ఛాంబర్‌లో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో హంటర్ డాగ్ 10 నెలల పాటు శిక్షణ తీసుకుందని, అసాంఘిక శక్తులు చేసే కుట్రలను ఈ డాగ్ పసిగడుతుందన్నారు.

News September 6, 2025

ఆదోని జిల్లాలో 3 మండలాలు.. మున్సిపాలిటీ?

image

కూటమి ప్రభుత్వం ఆదోని జిల్లా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తోంది. నియోజకవర్గంలో 44 గ్రామాలను 3 మండలాలుగా విభజించారు. 15 గ్రామాలను కలుపుతూ అరేకల్లు మండల కేంద్రంగా, 14 గ్రామాలను కలిపి పెద్దతుంబలం మండల కేంద్రంగా, 11 గ్రామాలను ఆదోని రూరల్ మండలంగా, 4 గ్రామాలను మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు తెరమీదకు వచ్చాయి. దీనిపై అభిప్రాయాలు సేకరించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.