News September 3, 2025
కన్న కూతురు, అన్న కూతురు దూరం!

TG: హరీశ్ రావు, సంతోశ్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన కవితను నిన్న BRS సస్పెండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె KCR, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది.
Similar News
News September 20, 2025
రేపటిలోగా అమెరికా వచ్చేయండి: మైక్రోసాఫ్ట్

H1B వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో మైక్రోసాఫ్ట్, JP మోర్గాన్ కంపెనీలు తమ ఉద్యోగులకు కీలక సూచనలు చేశాయి. ఉద్యోగులు అమెరికాలోనే ఉండాలని, విదేశాలకు వెళ్లవద్దని తెలిపాయి. ఇప్పటికే USను వదిలి వెళ్లిన H1B, H-4 వీసాదారులు SEP 21లోగా తిరిగి వచ్చేయాలని సూచించాయి. కాగా ఇప్పటికే H1B వీసాతో పనిచేస్తున్న తమ ఉద్యోగులకు రెన్యూవల్, ట్రాన్స్‌ఫర్ టైమ్‌లో ఈ ఫీజు చెల్లించాల్సి వస్తుందని కంపెనీలు భయపడుతున్నాయి.
News September 20, 2025
అల్పపీడనం ముప్పు.. అతిభారీ వర్షాలకు అవకాశం!

తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది తుఫానుగా మారే అవకాశమూ ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
News September 20, 2025
AIIMSలో 77 ఉద్యోగాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ సమీపంలోని బీబీనగర్ AIIMSలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 77 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. వయసు 45 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1,170. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. విద్యార్హతలు, జీతభత్యాల వివరాల కోసం <
#ShareIt