News September 3, 2025
HYD: రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ కౌంటర్ల ఏర్పాటు

సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల వద్ద హెల్ప్‌లైన్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ రైల్వే స్టేషన్ 90633 18082, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 040-27786170 నంబర్లకు కాల్ చేసి రైళ్లకు సంబంధించి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. వివిధ రైళ్ల రూట్లలో మార్పులు, షెడ్యూల్ మార్పులకు సంబంధించి అప్‌డేట్ అందిస్తామన్నారు.
Similar News
News September 5, 2025
ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.
News September 5, 2025
READY.. బాలాపూర్, ఖైరతాబాద్ రూట్ ఇదే

HYD: ఖైరతాబాద్, బాలాపూర్ నిమజ్జన రూట్లను కలెక్టర్ హరిచంద్ర ప్రకటించారు. బాలాపూర్ గణేశ్ కట్టమైసమ్మ నుంచి కేశవగిరి, చంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, ఆబిడ్స్ జీపీయో, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం గుండా ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. ఖైరతాబాద్ గణేశ్ బడా గణేశ్ నుంచి ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ వెళ్తుంది.
News September 5, 2025
ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.