News September 3, 2025
ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

TG: కవిత సస్పెన్షన్ నేపథ్యంలో BRS అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సంజయ్‌లతో భేటీ అయ్యారు. కవిత సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. అటు మరికాసేపట్లో కవిత మీడియాతో మాట్లాడనున్నారు.
Similar News
News September 5, 2025
రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.760 పెరిగి రూ.1,07,620కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.98,650 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.100 తగ్గి రూ.1,36,900గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 5, 2025
టీచర్ల ఆత్మస్థైర్యాన్ని YCP దెబ్బతీస్తోంది: లోకేశ్

AP: విద్య నేర్పే గురువుల పట్ల కూడా YCP నీచంగా వ్యవహరిస్తోందని మంత్రి లోకేశ్ ఆరోపించారు. <<17608204>>పక్క రాష్ట్రం<<>>లో జరిగిన ఘటనను AP టీచర్లకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో పని చేస్తున్న టీచర్లు తాగి బెంచీల కింద పడుకుంటున్న రీతిలో జుగుప్సాకరంగా వైసీపీ ఫేక్ హ్యాండిల్స్‌లో ఫేక్ ప్రచారం చేస్తోంది. దీంతో YCP నీతిబాహ్యమైన చర్యల్లో మరో మెట్టు దిగజారింది. ఇది క్షమించరాని నేరం’ అని ట్వీట్ చేశారు.
News September 5, 2025
అద్భుతం.. బాలభీముడు పుట్టాడు!

మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.