News September 3, 2025
డీజేల దగ్గర డాన్స్ చేస్తున్నారా? జాగ్రత్త

ఇటీవల వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 ఏళ్ల యువకుడు వినాయక నిమజ్జనంలో డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఏ సంగీతమైనా నిర్దిష్ట పరిమితి దాటి ఫ్రీక్వెన్సీ పెంచితే గుండెపై హానికర ప్రభావం పడుతుందని పలు అధ్యయనాల్లోనూ తేలింది.
Share it
Similar News
News September 6, 2025
GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

GST 2.0 ప్రభుత్వానికి కచ్చితంగా భారం కాకమానదు. కేంద్రం అంచనాల ప్రకారం ఏడాదికి నికర ఆర్థిక ప్రభావం రూ.48 వేల కోట్లుగా ఉంది. కానీ వినియోగం, వృద్ధిని లెక్కలోకి తీసుకుంటే GST 2.0తో కేంద్రానికి కనీసం రూ.3,700 కోట్లు నష్టముంటుందని SBI అంచనా వేసింది. ఇది ఆర్థిక లోటుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని స్పష్టం చేసింది. 2026-27లో ద్రవ్యోల్బణం 65-75 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశమున్నట్లు పేర్కొంది.
News September 6, 2025
13న మరో అల్పపీడనం.. భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఈనెల 13న మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. మరోవైపు 4 రోజులపాటు APలోని పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని వాతావరణ విభాగం అంచనా వేసింది. కాగా 2 రోజుల క్రితం వరకు తీవ్ర అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
News September 6, 2025
ఈ కార్ల ధరలు తగ్గాయ్..

మారుతి సుజుకీ బ్రెజా కారు ధర ప్రస్తుతం రూ.8.69 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. మొత్తం 45% పన్ను (28% GST+17% CESS) పడుతోంది. కొత్త జీఎస్టీ ప్రకారం 40% ట్యాక్స్ వేయనున్నారు. సెస్ లేకపోవడంతో రూ.30వేల వరకు ఆదా కానున్నాయి. నెక్సాన్ (పెట్రోల్) కారుపై రూ.68వేల నుంచి రూ.1.26 లక్షలు, వ్యాగన్ Rపై రూ.64వేల-రూ.84వేలు, స్విఫ్ట్‌పై రూ.71వేల-రూ.1.06 లక్షలు, i20పై రూ.83వేల-రూ.1.24 లక్షల వరకు సేవ్ కానున్నాయి.