News September 3, 2025

బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.

Similar News

News September 5, 2025

ఇడుపులపాయ: మినిమం టైమ్ స్కేల్ జీఓపై హర్షం

image

గత 15 ఏళ్లుగా నిబద్ధతతో ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో నాన్‌టీచింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ జీఓ మంజూరయ్యింది. ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగ భద్రతను కాపాడినందుకు సీఎం చంద్రబాబు, డీసిఎం పవన్ కళ్యాణ్, జీఓ అమలులో సహకరించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

News September 4, 2025

ప్రొద్దుటూరు: 7న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు

image

ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఈనెల 7న ఆదివారం అండర్ 18, 20 స్త్రీ, పురుషులకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు. 100M, 200M, 400M, 1000M పరుగు పోటీలు, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.