News September 3, 2025
సన్‌స్క్రీన్ రోజుకు ఎన్నిసార్లు అప్లై చేయాలంటే..

చర్మ సంరక్షణలో సన్‌స్క్రీన్‌ది కీలకపాత్ర. సీజన్‌తో సంబంధం లేకుండా ప్రతిరోజూ సన్‌స్క్రీన్ రాసుకోవడం ముఖ్యం. ఇది ట్యానింగ్, వృద్ధాప్యఛాయలు రాకుండా చూస్తుంది. ఎక్కువసేపు ఎండలో ఉండేవారు 2 గంటలకొకసారి సన్‌స్క్రీన్ రాసుకోవాలి. వేసవిలో వాటర్ రెసిస్టెంట్ సన్‌స్క్రీన్ వాడటం మంచిది. ప్రస్తుతం వాడే వివిధ రకాల లైట్ల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది. కాబట్టి ఇండోర్‌లో ఉన్నా సన్‌స్క్రీన్ వాడటం మంచిది.
Similar News
News September 7, 2025
బంధం బలంగా మారాలంటే..

ఆలుమగల బంధంలో మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది భాగస్వామితో ఎన్నో చెప్పాలనుకుంటారు. కానీ వాళ్లు అపార్థం చేసుకుంటారేమోనని చెప్పరు. లోలోపలే సతమతం అవుతుంటారు. దీంతో నిస్తేజం ఆవరిస్తుంది. మనసులోని మాటను చెబితేనే అసంతృప్తికి దూరంగా ఉండవచ్చు. అలాగే కొందరు మాటలతోనే భాగస్వామిని గాయపరుస్తుంటారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం చాలా ముఖ్యం.
News September 7, 2025
వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

* హెవీ మేకప్ కాకుండా తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి.
* ఫౌండేషన్, కన్సీలర్‌ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్.
* జిడ్డు చర్మం ఉంటే కాఫీ, చార్‌కోల్, గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్‌లు ఉన్న టోనర్ ఉపయోగించడం మంచిది.
* తాజా పండ్లు, ఆకుకూరలు, తగినన్ని నీరు తీసుకోవాలి. విటమిన్ సి ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడంలో సహాయపడుతుంది. కనీసం వ్యాయామం చేయాలి.
News September 7, 2025
వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఇలా

* మేఘావృతమైన రోజుల్లోనూ సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్‌ను ఉపయోగించాలి.
* వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్‌ని వాడాలి.
* సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్‌ను ఎంచుకోండి.
* మొటిమలను నివారించడానికి ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.