News September 3, 2025

రామాంజనేయుల మధ్య యుద్ధం.. మీకు తెలుసా?

image

ఆంజనేయుడికి ఒకనాడు తను నిత్యం కొలిచే రాముడితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గురువు ఆజ్ఞ మేరకు యయాతిని సంహరించాలనుకుంటాడు రాముడు. కానీ, యయాతిని కాపాడతానని హనుమంతుడు మాటిస్తాడు. దీంతో రాముడికి ఎదురు నిలుస్తాడు. ఎలాంటి ఆయుధం లేకుండా, భక్తిని మాత్రమే నమ్ముకుంటాడు. రాముడు ప్రయోగించిన ఏ అస్త్రం కూడా హనుమంతుడి భక్తి ముందు నిలవదు. శక్తి కన్నా భక్తికే ఎక్కువ బలం ఉందని ఈ వృత్తాంతం నిరూపించింది.

Similar News

News September 7, 2025

రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా: దుర్గేశ్

image

AP: త్వరలో నంది అవార్డులు అందించేందుకు CM చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. పాలకొల్లులో నిర్వహించిన 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్థాపనకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రాష్ట్ర కళాకారులకు గొప్ప అవకాశం. నవంబర్‌లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించబోతున్నాం’ అని తెలిపారు.

News September 7, 2025

సీక్రెట్ వెకేషన్‌లో రాహుల్: అమిత్ మాల్వీయ

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మలేషియాలో సీక్రెట్ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారని BJP IT సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వీయ ఆరోపించారు. ‘రాహుల్ మరోసారి మాయమయ్యారు. ఈసారి మలేషియాకు వెళ్లారు. బిహార్‌ రాజకీయ వేడి నుంచి కాంగ్రెస్ యువరాజు బ్రేక్ కోరుకున్నారేమో. లేదా ఎవరికీ తెలియకూడని సీక్రెట్ మీటింగ్‌కు వెళ్లి ఉండొచ్చు. ప్రజలు సమస్యల్లో ఉంటే ఆయన మాత్రం సెలవుల్లో ఉన్నారు’ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు.

News September 7, 2025

షిప్పింగ్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో 75పోస్టులు

image

<>షిప్పింగ్ <<>>కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 75 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 55 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు 20 ఉన్నాయి. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి వివిధ అర్హతలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి.