News September 3, 2025
దైవారాధనకు ఉత్తమ దిక్కు ఏదంటే?

సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి పూజ చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి కూర్చోవడం శ్రేష్ఠమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఒకవేళ అది వీలుకాకపోతే, ఇతర దిక్కుల వైపు తిరిగి పూజ చేయవచ్చు. అయితే, దక్షిణం వైపు మాత్రం పూజ చేయకూడదు. ఎందుకంటే, దక్షిణం దిక్కు యమధర్మరాజు దిశ. మరణానికి ప్రతీక. అందుకే పెద్దలు దక్షిణం వైపు చూసి పూజలు, జపాలు చేయడం హానికరం అని చెబుతారు.
Similar News
News September 7, 2025
రాష్ట్రానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా: దుర్గేశ్

AP: త్వరలో నంది అవార్డులు అందించేందుకు CM చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. పాలకొల్లులో నిర్వహించిన 4వ అంతర్జాతీయ లఘు చిత్రాల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘రాష్ట్రంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా స్థాపనకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇది రాష్ట్ర కళాకారులకు గొప్ప అవకాశం. నవంబర్‌లో రాజమహేంద్రవరంలో నంది నాటకోత్సవాలు నిర్వహించబోతున్నాం’ అని తెలిపారు.
News September 7, 2025
సీక్రెట్ వెకేషన్‌లో రాహుల్: అమిత్ మాల్వీయ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మలేషియాలో సీక్రెట్ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారని BJP IT సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వీయ ఆరోపించారు. ‘రాహుల్ మరోసారి మాయమయ్యారు. ఈసారి మలేషియాకు వెళ్లారు. బిహార్ రాజకీయ వేడి నుంచి కాంగ్రెస్ యువరాజు బ్రేక్ కోరుకున్నారేమో. లేదా ఎవరికీ తెలియకూడని సీక్రెట్ మీటింగ్‌కు వెళ్లి ఉండొచ్చు. ప్రజలు సమస్యల్లో ఉంటే ఆయన మాత్రం సెలవుల్లో ఉన్నారు’ అంటూ ఓ ఫొటో షేర్ చేశారు.
News September 7, 2025
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 75పోస్టులు

<