News September 3, 2025

లండన్‌లో కోహ్లీకి ఫిట్‌నెస్ టెస్ట్స్.. నెటిజన్ల ఫైర్

image

లండన్‌లో నిర్వహించిన యోయో, బ్రాంకో టెస్టుల్లో <<17597735>>విరాట్ కోహ్లీ<<>> పాస్ అయ్యారు. ఫిట్‌నెస్ టెస్ట్ వ్యవహారంలో BCCI ఫేవరిటిజం ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆటగాళ్లందరికీ బెంగళూరులో నిర్వహించి, కోహ్లీకి ఒక్కడికే విదేశాల్లో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అతడికే ఎందుకు ఈ స్పెషల్ ప్రివిలేజ్ అని నిలదీస్తున్నారు. కాగా కొంతకాలంగా కోహ్లీ లండన్‌లోనే ఉంటున్నారు.

Similar News

News September 7, 2025

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్?

image

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు <<17630461>>ఇండియా-ఏ<<>> కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినట్లు సమాచారం. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో విఫలమైన కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది.

News September 7, 2025

తిరుపతి లడ్డూ హైదరాబాద్‌లో

image

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు అందజేసే పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ మహా ప్రసాదం హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంటుందని చాలామందికి తెలియదు. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయాల్లో 9AM నుంచి 5PM వరకు వీటిని విక్రయిస్తారు. ఒక్కో లడ్డూ ధర ₹50. ఒకరు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. వివిధ కారణాలతో తిరుమల వెళ్లలేని వారికి ఇక్కడే లడ్డూ లభించడం ఎంతో ఆనందాన్నిస్తోంది.

News September 7, 2025

బంధం బలంగా మారాలంటే..

image

ఆలుమగల బంధంలో మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది భాగస్వామితో ఎన్నో చెప్పాలనుకుంటారు. కానీ వాళ్లు అపార్థం చేసుకుంటారేమోనని చెప్పరు. లోలోపలే సతమతం అవుతుంటారు. దీంతో నిస్తేజం ఆవరిస్తుంది. మనసులోని మాటను చెబితేనే అసంతృప్తికి దూరంగా ఉండవచ్చు. అలాగే కొందరు మాటలతోనే భాగస్వామిని గాయపరుస్తుంటారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం చాలా ముఖ్యం.