News September 3, 2025

హరీశ్ వల్లే వారంతా పార్టీని వీడారు: కవిత

image

TG: గతంలో పార్టీకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడవాలని హరీశ్ రావు ప్రయత్నించారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. హరీశ్ వల్లే ఈటల, మైనంపల్లి, జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు పార్టీని వీడారని మండిపడ్డారు. ‘దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి హరీశే కారణం. హరీశ్, సంతోష్ మేకవన్నె పులులు. నాన్నకు నన్ను దూరం చేసేందుకు కుట్ర చేశారు’ అని ఆమె విరుచుకుపడ్డారు.

Similar News

News September 7, 2025

ప్రశాంతంగా నిమజ్జనం.. అభినందించిన సీఎం

image

TG: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై సీఎం రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. 9 రోజులపాటు భక్తులు గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ఘన వీడ్కోలు పలికారని పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అహర్నిశలు పనిచేసిన పోలీసు, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, పంచాయతీ రాజ్ ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్?

image

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయనకు <<17630461>>ఇండియా-ఏ<<>> కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పినట్లు సమాచారం. అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో విఫలమైన కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయస్‌ను ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా టీమ్‌ఇండియా రెండు టెస్టులు ఆడనుంది.

News September 7, 2025

తిరుపతి లడ్డూ హైదరాబాద్‌లో

image

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు అందజేసే పవిత్రమైన లడ్డూ ప్రసాదం అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ మహా ప్రసాదం హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉంటుందని చాలామందికి తెలియదు. హిమాయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌లోని TTD ఆలయాల్లో 9AM నుంచి 5PM వరకు వీటిని విక్రయిస్తారు. ఒక్కో లడ్డూ ధర ₹50. ఒకరు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు. వివిధ కారణాలతో తిరుమల వెళ్లలేని వారికి ఇక్కడే లడ్డూ లభించడం ఎంతో ఆనందాన్నిస్తోంది.