News April 3, 2024
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

తాడిపత్రి మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని చుక్కలూరులో రైతు మిద్దె గోపాల్ రెడ్డి వ్యవసాయ పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 27, 2026
అనంతపురంలో ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ

అనంతపురం రూడ్ సెట్ సంస్థలో వచ్చే నెల 2 నుంచి 30 రోజుల పాటు నిరుద్యోగ పురుషులకు ఉచిత సెల్‌ఫోన్ రిపేర్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి గురువారం తెలిపారు. 18-50 ఏళ్ల లోపు గ్రామీణ నిరుద్యోగ యువకులు ఆధార్, రేషన్ కార్డులతో దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితమని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు అనంతపురం రూడ్ సెట్ కార్యాలయన్ని సంప్రదించాలన్నారు.
News March 26, 2026
గర్భస్థ లింగ నిర్ధారణపై కలెక్టర్ హెచ్చరిక

అనంతపురంలో గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఓ.ఆనంద్ హెచ్చరించారు. పీసీ-పీఎన్‌డీటీ చట్టం అమలుపై సమీక్షిస్తూ స్కానింగ్ సెంటర్లపై కఠిన నిఘా ఉంచాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.