News September 3, 2025
ప్రకాశం జిల్లాలోని పరిశ్రమలకు గుడ్ న్యూస్..!

ప్రకాశం జిల్లాలోని వివిధ పరిశ్రమలకు చెందిన 149 క్లెయిములకుగాను రూ.3.25 కోట్ల రాయితీలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంజూరు చేశారు. బుధవారం ఆమె అధ్యక్షతన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను గడువు వరకు వేచి ఉండకుండా త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News September 5, 2025
నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేయాలి: ప్రకాశం కలెక్టర్

ప్రకాశం జిల్లాలో మరో 500 మెట్రిక్ టన్నుల నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేసేలా అనుమతించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరుతోపాటు జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
News September 5, 2025
ప్రకాశం జిల్లాలో జనసేన తీరుపై పవన్ ఆరా.!

ప్రకాశం జిల్లాలో జనసేన తీరుపై జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లు సమాచారం. జనసేనలో కీలకంగా ఉండి అన్నిపనులు చక్కబెట్టే ఓ యువనేత నోరుజారిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు రియాజ్ స్పందించారు. అయితే ప్రకాశం జిల్లా జనసేన నేతలు ఒక్కతాటిపై లేకనే ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయని టాక్. ఇదే విషయం పవన్ వద్దకు చేరగా ఈ విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
News September 5, 2025
ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సబ్ కలెక్టర్

మార్కాపురం MPDO కార్యాలయంలో ఎరువుల నియంత్రణ చట్టంపై వ్యవసాయ సహాయకులకు, డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ కలెక్టర్ S.V.త్రివినాగ్ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. ఎరువుల కొరత సృష్టిస్తే డీలర్షిప్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను MRP ధరలకే విక్రయించాలని సూచించారు. MRO చిరంజీవి, SI సైదుబాబు పాల్గొన్నారు.