News September 3, 2025
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘కొత్త లోక’

‘ప్రేమలు’ ఫేమ్ నస్లేన్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ‘కొత్త లోక’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. లో బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఫస్ట్ వీక్‌లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. డొమినిక్ అరుణ్ రూపొందించిన ఈ మూవీని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. గత నెల 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. హీరోయిన్‌కు సూపర్ పవర్స్ ఉంటే ఏం జరుగుతుందనేది ఈ సినిమా కథ.
Similar News
News September 5, 2025
హార్దిక్ పాండ్యా న్యూ లుక్

టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్‌తో ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ప్లాటినం బ్లాండ్ హెయిర్ స్టైల్‌తో కనిపించారు. ఈ న్యూ లుక్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆసియా కప్ కోసం హార్దిక్ రెడీ అయ్యారని, అతడి ట్రాన్స్‌ఫమేషన్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. SEP 9న మొదలయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటికే పాండ్యా దుబాయ్ చేరుకున్నారు. హార్దిక్ న్యూ లుక్ ఎలా ఉంది? కామెంట్.
News September 5, 2025
ఈ బైకుల ధరలు పెరుగుతాయ్

<<17606832>>GST<<>>లో 350 cc కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ కల్గిన బైకులపై 40% పన్ను పడనుంది. అయితే ఈ మోడళ్ల సేల్స్ తక్కువని, పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు.
*రాయల్ ఎన్‌ఫీల్డ్: himalayan 450, Interceptor 650, continental gt 650
*బజాజ్ డామినార్ 400
*KTM డ్యూక్ 390, RC 390, అడ్వెంచర్ 390
*Kawasaki: నింజా 400, Z650 *Honda: CB500X
News September 5, 2025
ధరల తగ్గింపు.. ఓల్డ్ స్టాక్ పరిస్థితేంటి?

GST సంస్కరణలతో దాదాపు 400 రకాల గూడ్స్&సర్వీసెస్ రేట్లు ఈనెల 22 నుంచి తగ్గనున్నాయి. మరి ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటి రేట్లు తగ్గిస్తారా లేదా అన్న సందేహం నెలకొంది. అయితే ఈ సమస్యను కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లే ఎదుర్కొంటారని తెలుస్తోంది. GST తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలన్న కేంద్రం ఆదేశాలతో ధరల సర్దుబాటు ప్రక్రియ స్టార్ట్ చేసినట్లు సమాచారం. కొత్త రేట్ స్టిక్కర్‌తో విక్రయించే అవకాశముంది.