News September 3, 2025

సిటీలో నలుమూలల నుంచి నిమజ్జనాలకు బస్సులు

image

ఈనెల 6న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్, ట్యాంక్ బండ్‌కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RTC అధికారులు తెలిపారు. మెహదీపట్నం, బర్కత్‌పురా, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్- 1,2 డిపోల నుంచి సర్వీసులు ఉంటాయని తెలిపారు. కాచిగూడ, రాంనగర్ నుంచి ఎల్బీనగర్, కొత్తపేట, ఇందిరాపార్క్, గచ్చిబౌలి, వనస్థలిపురం, రాజేంద్రనగర్- లక్డికాపూల్, పటాన్‌చెరు- లింగంపల్లి రాకపోకలు సాగించొచ్చాన్నారు.

Similar News

News September 7, 2025

HYD: కలిసొచ్చిన వినాయక చవితి.. రూ.99కే ఎలక్ట్రిక్ బైక్

image

వినాయక చవితి ఓ వ్యక్తికి కలిసి వచ్చింది. నిమజ్జనం సందర్భంగా రూ.99కే ఎలక్ట్రిక్ బైక్‌ను గెలుచుకున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని అంజనాద్రి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ లక్కీ డ్రాలో పాల్గొన్న అనిల్.. రూ.99కే ఎలక్ట్రిక్ బైక్ సొంతం చేసుకున్నాడు. లక్కీ టికెట్ పద్ధతిలో బైక్‌ను అందించాలని కమిటీ నిర్ణయించడంతో 425 మంది డ్రాలో పాల్గొన్నారు. అయితే అనిల్‌కు అదృష్టం వరించడంతో సంతోషం వ్యక్తం చేశాడు.

News September 7, 2025

HYD: టస్కర్ వాహనం కిందపడి జీహెచ్‌ఎంసీ కార్మికురాలి మృతి

image

బషీర్‌బాగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు రేణుక(50) మృతి చెందింది. గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పనిచేస్తుంది. ఇవాళ ఉదయం బషీర్‌బాగ్–లిబర్టీ మార్గంలో విధుల్లో ఉండగా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు వాహనం కిందపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయింది. పోలీసులు డ్రైవర్‌ గజానంద్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

News September 7, 2025

చంద్రగ్రహణం.. ఆలయాల మూసివేత

image

నేడు చంద్రగ్రహణం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి, స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం వరకు మూసి ఉంచుతామని ఆలయ అధికారులు ప్రకటించారు. సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత మరుసటి రోజు ఉదయం నుంచి భక్తులను అనుమతిస్తామని పండితులు తెలిపారు.