News September 3, 2025
చలాన్ కోసం కాదు.. రక్షణ కోసం హెల్మెట్ వాడండి: పోలీసులు

చాలామంది చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నాణ్యతలేని హెల్మెట్లను వాడి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే రక్షణనిచ్చే నాణ్యమైన హెల్మెట్లను వాడాలని TG పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. ‘ISI మార్క్ ఉన్న హెల్మెట్ మాత్రమే వాడండి. నాసిరకం హెల్మెట్లతో రక్షణ ఉండదు. చలాన్ తప్పించుకునేందుకు కాకుండా రక్షణ కోసం మంచి హెల్మెట్ వాడండి. హెల్మెట్ మీ రక్షణ కవచమని గుర్తుంచుకోండి’ అని పేర్కొన్నారు.
Similar News
News September 7, 2025
జపాన్ పీఎం ఇషిబా రాజీనామా?

జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా తన పదవికి రాజీనామా చేయనున్నారు. అధికార LDPలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ NHK తెలిపింది. దీనిపై ఇవాళ సాయంత్రం 6 గంటలకు PM ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని పేర్కొంది. జులైలో జరిగిన హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ (అప్పర్ హౌస్) ఎన్నికల్లో LDP, మిత్రపక్షం కొమైటో మెజారిటీ కోల్పోయింది. దీంతో ఆయనపై వ్యతిరేకత పెరిగింది.
News September 7, 2025
హెల్త్ టిప్స్

*బీట్ రూట్ తింటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది
*జామ పండ్లతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
*క్యారెట్లు కంటి చూపు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి
*కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ వెంట్రుకలకు మేలు చేస్తాయి
*పెరుగు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది
*కరివేపాకుతో రక్తహీనత తగ్గుతుంది
*అల్లంతో కడుపు ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
SHARE IT
News September 7, 2025
ప్రభుత్వ అవినీతి వల్లే యూరియా కొరత: బొత్స

AP: యూరియా కొరతపై ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరిస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కోసం రైతుల ఇబ్బందులు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ అవినీతి వల్లే ఈ సమస్య వచ్చిందని ఫైరయ్యారు. అటు ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, నెట్‌వర్క్ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పేదలకు వైద్యం అందడం లేదని ఆరోపించారు.