News September 3, 2025
కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభం

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎస్టీ శ్లాబుల మార్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆక్వా రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రభావం పడే వస్తువుల విషయంలోనూ చర్చించనున్నారు. రైతులు, ఉద్యోగులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 5, 2025
అద్భుతం.. బాలభీముడు పుట్టాడు!

మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో 34 ఏళ్ల మహిళ 5.2 కేజీల మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ సాధ్యపడకపోవడంతో సిజేరియన్ చేశామని వైద్యులు తెలిపారు. ఇంత బరువున్న శిశువును చూడటం ఇదే తొలిసారి అని సంబరపడుతూ అతడితో ఫొటోలు తీసుకున్నారు. ఆ ఫొటోల్లో ఆ పిల్లాడు ఏడాది వయసు ఉన్నవాడిగా కనిపించాడు. సాధారణంగా పిల్లలు 2.5 కేజీల నుంచి 3.2 కేజీల బరువుతో జన్మిస్తారు.
News September 5, 2025
మహిళల WC: రూ.100కే టికెట్

మహిళల వన్డే WC టికెట్ల ధరను ICC రూ.100గా నిర్ణయించింది. ప్రేక్షకులను స్టేడియాలకు రప్పించేందుకు లీగ్ మ్యాచులకు ఈ ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సెప్టెంబర్ 30న మొదలయ్యే ఈ టోర్నీని ఘనంగా ప్రారంభించేందుకు గువహటిలో సింగర్ శ్రేయా ఘోషల్‌తో గ్రాండ్‌గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది. శ్రీలంకతో పాటు భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. విశాఖలో OCT 9, 12, 13, 16, 26 తేదీల్లో మ్యాచులున్నాయి.
News September 5, 2025
గాజాలో 64వేలు దాటిన మరణాలు

గాజాలో మరణాల సంఖ్య 64వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. నిన్న ఇజ్రాయెల్ దాడుల్లో 28 మంది మరణించగా వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తే 48 మంది బందీలను విడుదల చేస్తామన్న హమాస్ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. యుద్ధంలో ఓడించడమే లక్ష్యమని స్పష్టం చేసింది. 2023 నుంచి ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.