News September 3, 2025
ఖైరతాబాద్: నిమజ్జనానికి రూట్ మ్యాప్ రెడీ: సీపీ ఆనంద్

గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేశామని HYD సీపీ సీవీ.ఆనంద్ తెలిపారు. రూట్ మ్యాప్‌లో భాగంగా ఆయన HYD కలెక్టర్ హరిచందన, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి బాలాపూర్ గణేశ్ మండపాన్ని ఈరోజు సందర్శించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జన శోభాయాత్ర సాగే చాంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాహీ మార్కెట్, అబిడ్స్, ట్యాంక్ బండ్ రూట్‌లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
Similar News
News September 5, 2025
అన్నమయ్య: 1161.95 మెట్రిక్ టన్నులు యూరియా

అన్నమయ్య జిల్లాలో నేటికి యూరియా 1161.95 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాదని గురువారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. మార్క్ ఫెడ్ ద్వారా 49.95 మెట్రిక్ టన్నులు, రైతు సేవా కేంద్రాలు ద్వారా 608 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులు ద్వారా 504 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉన్నాదన్నారు. రైతులు అవసరాన్ని తక్షణమే తీర్చడానికి అన్ని కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉన్నాదని కలెక్టర్ అన్నారు.
News September 5, 2025
HYD: నిమజ్జనం చేసిన లారీలు ఇలా వెళ్లాలి

ట్యాంక్ బండ్ వద్ద విగ్రహాలను తెచ్చిన లారీలు నిమజ్జనం పూర్తి చేసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లను అధికారులు ఏర్పట్లు చేశారు. NTR మార్గ్‌లో నిమజ్జనం చేసినవి నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాట్యూ, కేసీపీల మీదుగా వెళ్లాలి. అప్పర్ ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం చేసిన లారీలు చిల్డ్రన్స్ పార్క్, DBR మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలన్నారు.
News September 5, 2025
ASF: సర్కారు బడి రూపురేఖలు మార్చిన రంగయ్య మాస్టార్

ఉపాధ్యాయుడు అంటే కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదని, అంతకుమించి సమాజ సేవకుడిగా ఉండాలని నిరూపించారు కెరమెరి మండలం సావర్ ఖేడ ప్రాథమిక పాఠశాల HM రంగయ్య. 2010 నుంచి అక్కడే విధులు నిర్వహిస్తూ పాఠశాల రూపురేఖలే మార్చేశారు. 2022లో బదిలీ అయినప్పటికీ మళ్లీ తిరిగి వచ్చారు. 2021లో జాతీయ ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. రంగయ్య కృషితో ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మారిందని పలువురు కొనియాడారు.