News September 3, 2025
కూటమి పాలనలో జగన్ ఫొటోతో సర్టిఫికెట్లు!

AP: గుంటూరు బ్రాడీపేటలో దివ్యాంగ సర్టిఫికెట్లపై జగన్ ఫొటోలు దర్శనమివ్వడం కలకలం రేపింది. ప్రభుత్వం మారి ఏడాదైనా సచివాలయం సిబ్బంది జగన్ ఫొటోలతోనే ధ్రువపత్రాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇది మీడియాలో వైరల్ కావడంతో పైఅధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వాటిని వెనక్కి తీసుకొని లబ్ధిదారులకు కొత్త సర్టిఫికెట్లు జారీ చేశారు. సదరు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
Similar News
News September 5, 2025
CM చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్

AP: సీఎం చంద్రబాబు కొత్త హెలికాప్టర్ వినియోగిస్తున్నారు. ఇదివరకు ‘బెల్’ తయారు చేసిన ఛాపర్ వాడేవారు. అది ఎక్కువ దూరం ప్రయాణించేందుకు పనికిరాకపోవడంతో అత్యాధునిక ఫీచర్లతో కూడిన AIR Bus H160 మోడల్ హెలికాప్టర్ వాడుతున్నారు. సన్ లైట్ తగ్గినా, ఆకాశం మేఘావృతమైనా కొన్ని హెలికాప్టర్లకు అనుమతి ఇవ్వరు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఛాపర్‌లో లైటింగ్ తక్కువగా ఉన్నా ప్రయాణించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
News September 5, 2025
HYDలో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది: హరీశ్

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హైడ్రాతో ఎన్నారైలను రేవంత్ భయపెట్టారని, దీంతో వారు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు. మేడిగడ్డలో 3 పిల్లర్లు కూలితే రాద్ధాంతం చేస్తున్నారని లండన్ పర్యటనలో మండిపడ్డారు. ఇప్పటికీ బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. రేవంత్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా BRSదే విజయమన్నారు.
News September 5, 2025
సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్

పెట్టుబడుల ఒప్పందాల కోసం యూకే పర్యటనకు వెళ్లిన తమిళనాడు సీఎం స్టాలిన్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. బ్లేజర్, సన్ గ్లాసెస్, ఇన్‌షర్ట్‌తో మెరిశారు. అక్కడి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పెరియార్ స్కెచ్‌ను ఆయన ఆవిష్కరించారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్ రాయిస్ కంపెనీ తమిళనాడులోని హోసూర్‌లో డిఫెన్స్ ఇంజిన్స్ తయారు చేసేందుకు స్టాలిన్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది.