News April 3, 2024

పాక్ సైనికులను వణికించిన సామ్ బహదూర్ జయంతి నేడు!

image

ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్‌ సామ్ మానెక్‌ షా అలియాస్ సామ్ బహదూర్ జయంతి నేడు. ఈయన ఇండో – పాకిస్థాన్ యుద్ధంలో భారత సైన్యాన్ని ముందుండి నడిపించారు. ఈయన ఫీల్డ్ మార్షల్ స్థాయి పదోన్నతి పొందిన మొదటి భారతీయ ఆర్మీ అధికారి. యుద్ధం సమయంలో పాక్ సైనికులకు సామ్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘మీరు లొంగిపోతారా లేదా మేమే మిమ్మల్ని తుడిచేయాలా?’ అని హెచ్చరించడంతో 93వేల మంది పాక్ సైనికులు లొంగిపోయారు.

Similar News

News July 6, 2025

రేపటి నుంచి 8 గంటల ముందే..

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రిజర్వేషన్ ఛార్టుల ప్రిపరేషన్‌లో కొత్త విధానం జులై 7 నుంచి అమలు కానుంది. ఇప్పటివరకు రైలు బయల్దేరడానికి 4 గంటల ముందే ఛార్జ్ ప్రిపేర్ అవుతుండగా, రేపటి నుంచి 8 గంటల ముందే ఛార్ట్ ప్రిపేర్ కానుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు బయల్దేరే రైళ్ల ఛార్టులను ముందురోజు రాత్రి 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల బెర్త్ దొరకనివారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవచ్చు.

News July 6, 2025

కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి: హరీశ్ రావు

image

TG: పదేళ్ల KCR పాలనలో రైతు ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో తగ్గాయని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా 2015-2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల డేటాను ఆయన షేర్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1% ఉండగా 2022 నాటికి 1.57%కి తగ్గినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంతో పలు కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

News July 6, 2025

4 బంతుల్లో 3 వికెట్లు

image

మేజర్ లీగ్‌ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.