News September 3, 2025

NGKL: ఈనెల 5న జీపీఓ నియామక పత్రాల అందజేత: కలెక్టర్

image

ఈనెల 5న HYDలోని హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీపీఓ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరాలు వెల్లడించారు.

Similar News

News September 7, 2025

పండగ రద్దీ తగ్గించేందుకు ఇతర స్టేషన్లకు రైళ్ల మళ్లింపు

image

దసరా, దీపావళి పండగల కోసం సొంతూరికి వెళ్లేందుకు ప్రయాణికులు సెప్టెంబర్ నుంచే సికింద్రాబాద్ స్టేషన్‌కు క్యూ కడతారు. అధిక రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కొన్ని రైళ్లను ఇతర స్టేషన్లకు మళ్లించనున్నారు. సనత్‌నగర్, చర్లపల్లి, అమ్ముగూడ, మౌలాలి స్టేషన్లకు మళ్లించాలని నిర్ణయించారు. పండగ రద్దీ కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిటీ పోలీస్, ఆర్టీసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోనున్నారు.

News September 7, 2025

గద్వాల: కృష్ణా నదిలో బాలుడి గాలింపు

image

గద్వాల(M) రేకులపల్లి వద్ద కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారుల్లో ఒకరు గల్లంతయ్యారు. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చంద్రశేఖర్(13), అతని స్నేహితుడు కృష్ణతో కలిసి చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లారు. రాత్రి కావడంతో వారు పుట్టిలో నిద్రిస్తుండగా, నదిలో ప్రవాహం పెరిగి పుట్టి కొట్టుకుపోయింది. కృష్ణకు ఈత రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. చంద్రశేఖర్ కోసం గాలిస్తున్నారు.

News September 7, 2025

GNT: గ్రహణం రోజు దర్భలు ఎందుకు వాడతారో తెలుసా..?

image

దర్భలు ఎంతో పవిత్రమైనవి. సూర్య,చంద్ర గ్రహణాలు ఏర్పడిన సమయంలో చాలా మంది దర్భలను తమ ఇళ్లకు తీసుకు వెళుతుంటారు. ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంగా ఈ సమయంలో రాహువు చెడు దృష్టి, చంద్రుడి నుంచి వచ్చే నీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. చంద్రుని కిరణాలు, రాహువు చెడు దృష్టి పడినప్పటికీ ఎలాంటి నష్టం కలుగకుండా ఆహార పదార్థాలపై దర్బలు వేసి ఉంచుతారని పండితులు చెబుతారు.