News September 3, 2025

నస్పూర్: పరిపాలన సులభతరం చేసేందుకు గ్రామ పాలనాధికారులు

image

గ్రామీణ స్థాయిలో పరిపాలన సులభతరం చేసేందుకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల నియామక ప్రక్రియ చేపట్టిందని రాష్ట్ర ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News September 7, 2025

ఘట్‌కేసర్: జులూస్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

ఘట్‌కేసర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ డేవిడ్ గుండెపోటుతో మృతిచెందాడు. నిన్న విధులు ముగించుకొని మల్కాజిగిరి ఆనంద్‌బాగ్ విష్ణుపురి కాలనీలోని ఇంటికి వెళ్లాడు. సాయంత్రం కాలనీ వినాయకుడి ఊరేగింపులో డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. ఉదయం 4 గంటలకు అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

News September 7, 2025

ఈ నెల 15 నుంచి UPI లిమిట్ పెంపు.. రోజుకు ఎంతంటే?

image

ఈ నెల 15 నుంచి కొన్ని ప్రత్యేకమైన పేమెంట్స్‌(P2M)కు UPI లిమిట్‌ను రోజుకు రూ.10 లక్షలకు పెంచుతూ NPCI నిర్ణయించింది. ప్రస్తుతం రోజుకు రూ.లక్ష మాత్రమే UPI ద్వారా పంపొచ్చు. ఇన్సూరెన్స్, పన్నులు, స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్లకు ఇది ఇబ్బందిగా మారడంతో ఒక్కసారి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షలు పంపుకునే వెసులుబాటు కల్పించింది. కాగా మనం (P2P) స్నేహితులు, బంధువులకు పంపే లిమిట్ మాత్రం రూ.లక్షగానే ఉంది.

News September 7, 2025

వికారాబాద్: మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా

image

వికారాబాద్ మున్సిపాలిటీలోని 10వ, 11వ వార్డులలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తూ గ్రామ పెద్దలు, యువజన, మహిళా సంఘాలు సమావేశం నిర్వహించాయి. గ్రామంలో మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేటి నుంచి తమ ప్రాంతంలో మద్యం అమ్మిన వారికి రూ.ఐదు లక్షల జరిమానా విధిస్తామని తీర్మానించారు. అలాగే ప్రజల సహకారంతో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.