News April 3, 2024
కర్నూలు: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

ఓ ప్రేమ జంట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పత్తికొండ మండలం పులికొండలో జరిగింది. ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రాజశేఖర్, ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో సోమవారం అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మంగళవారం గ్రామ సమీపంలోని ఓ పొలంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న జంటను గుర్తించి ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News January 13, 2026
ప్రాక్టికల్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అన్ని సౌకర్యాలతో కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పరీక్ష గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. సెల్‌ఫోన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 21,150 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
News January 13, 2026
కర్నూలు: ‘రూ.8 వేలతో కొంటాం’

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి ద్వారా క్వింటాకు రూ.8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. కంది పంట నమోదు చేసిన ఈ-క్రాప్ సర్టిఫికెట్‌తో పాటు తేమ శాతం పరీక్షకు కందుల శాంపిల్ తీసుకొని రావాలని రైతులను సూచించారు.
News January 12, 2026
సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.


