News September 3, 2025
FLASH: HYD: గృహిణి ఆత్మహత్య.. కేసు నమోదు

HYD అమీన్‌పూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే గృహిణి పార్వతి(31) ఉరేసుకుని చనిపోయింది. మృతురాలికి విష్ణువర్ధన్(7), సాత్విక్(6) ఇద్దరు కుమారులు. భర్త వెంకట కోటేశ్వరరావు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 5, 2025
నిమజ్జనోత్సవం.. ముంబైతో HYD ఢీ

గతంలో గణేశ్ నిమజ్జనోత్సవాలంటే అందరికీ ముంబై గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ఇందులోకి HYD గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలంగా ముంబైకి ధీటుగా పోటీ పడుతోంది. ముంబైలో దాదాపు 3 లక్షల విగ్రహాలు ప్రతిష్ఠిస్తే సిటీలో 1.71 లక్షలు ప్రతిష్ఠించారు. అక్కడ 70 చెరువుల్లో నిమజ్జనం జరిగితే ఇక్కడ 20 చెరువుల వద్ద వేడుక జరుగుతోంది. ఇక్కడ దాదాపు 30 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తే అక్కడ 24వేలమందే విధుల్లో ఉంటున్నారు.
News September 5, 2025
యుద్ధప్రాతిపాదికన ఎస్టీపీల పనులు ప్రారంభించాలి: ఎండీ

దసరాలోపు కొత్త సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ) నిర్మాణ పనులు ప్రారంభించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పేర్కొన్నారు. నూతనంగా అమృత్- 2.0 పథకంలో భాగంగా నిర్మించే 39 ఎస్టీపీల నిర్మాణంపై జలమండలి కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజీ- 2 కింద నిర్మించనున్న 39 ఎస్టీపీల పురోగతిపై అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణానికి ప్లాన్లను వెంటనే ఖరారు చేయాలన్నారు.
News September 5, 2025
HYD: అన్న అవుతాడు.. పెళ్లి వద్దన్నందుకు సూసైడ్

ప్రేమవిఫలం కావడంతో <<17610499>>యువతి<<>> పురుగుమందు తాగి సికింద్రాబాద్ గాంధీలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. మెదక్‌లోని శివ్వంపేట మం.తాళ్లపల్లి తండాకు చెందిన సక్కుబాయి(21) గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతోంది. నారాయణఖేడ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పింది. వరసకు అన్న అవుతాడని తల్లిదండ్రులు పెళ్లి వద్దనడంతో ఈ నెల 1న పురుగు మందు తాగింది.